Home
Telangana
The Tense Atmosphere In Many Places During The Municipal Elections Led To Excitement As The Results Were Counted
హోరాహోరీ.. స్వల్ప తేడాతో చేజారి!
మున్సిపల్ ఎన్నికల్లో పలుస్థానాల్లో హోరాహోరీ నెలకొన్నది. ఫలితాల కౌంటింగ్ ఉత్కంఠకు దారితీసింది. ఈన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. అధికార పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు.
- సర్వశక్తులు ఒడ్డినా త్రుటిలో చేజారిన విజయం
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో పలుస్థానాల్లో హోరాహోరీ నెలకొన్నది. ఫలితాల కౌంటింగ్ ఉత్కంఠకు దారితీసింది. ఈన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. అధికార పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. పలువురు అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారు. మిర్యాలగూడ 18వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి వల్లంపల్లి వినోద్‌కుమార్ కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు.
విజయానికి చేరువలో ఓడిన అభ్యర్థులు
- నల్లగొండ కార్పొరేషన్ 14వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బొజ్జ వెంకటయ్య కేవలం ఆరు ఓట్ల తేడాతో విజయం
- వేములవాడ 6వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నీలం శేఖర్ కేవలం 9 ఓట్ల తేడాతో ఓటమి
- పరిగి మున్సిపాలిటీ 8వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ కేవలం 8 ఓట్ల తేడాతో ఓటమి
- క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గాజుల దివ్య 5 ఓట్ల తేడాతో ఓటమి. ఇదే మున్సిపాలిటీ 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బొమ్మ భీమయ్య మూడు ఓట్లతో తేడాతో ఓడిపోగా, మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే కావడం గమనార్హం.
- బెల్లంపల్లి మున్సిపాలిటీ 24వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్తూరి వరలక్ష్మి రెండు ఓట్ల తేడాతో ఓటమి.
- లక్షెట్టిపేట 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మెట్టు కళ్యాణి మూడు ఓట్ల తేడాతో ఓటమి.
- ఖమ్మం జిల్లా ఏదులాపురం 17వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి 5 ఓట్ల తేడాతో ఓటమి. 18వార్డులోను బీఆర్ఎస్ అభ్యర్థి ఎనిమిది ఓట్లతేడాతో ఓటమి.
- మధిర 14వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి 10 ఓట్ల తేడాతో ఓటమి.
- చెన్నూరు 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గుర్రం ఉమారాణి 9 ఓట్ల తేడాతో ఓటమి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

