Encounter | జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం
Encounter | జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. సైన్యం, పోలీసుల ప్రత్యేక బృందం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆర్మీకి చెందిన పారా మిలటరీ, 22 గర్హ్వాల్ రైఫిల్స్, కేంద్రపాలిత ప్రాంత పోలీసులకు ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ (SOG) ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.
Encounter | జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. సైన్యం, పోలీసుల ప్రత్యేక బృందం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆర్మీకి చెందిన పారా మిలటరీ, 22 గర్హ్వాల్ రైఫిల్స్, కేంద్రపాలిత ప్రాంత పోలీసులకు ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ (SOG) ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఉదంపూర్, కథువా జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారానికి సంబంధించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భారీ వర్షాలు, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నా ఉగ్రవాదులను ఏరివేయడంలో భద్రతా బలగాలు విజయం సాధించాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు.
ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం ఇవ్వాలని సైన్యం పౌరులకు విజ్ఞప్తి చేసింది. హతమైన ఉగ్రవాదుల నుంచి ఎం4 రైఫిల్, ఏకే రైఫిల్, పిస్టల్ సహా పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇదిలా ఉండగా.. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఈ నెల 18 నుంచి మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. తెల్లవారుజామున జమ్మూ కశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్లో పాక్ బలగాలు అకారణంగా జరిపిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం (BSF) సైనికుడు గాయపడ్డాడు. సైనికులు అప్రమత్తంగా ఉన్నారని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో కాపలా కాస్తున్న బీఎస్ఎఫ్ పేర్కొంది. ఈ సరిహద్దు సుమారు 3,323 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

