MLA Rajasingh | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అర గంట సమయంలోనే రెండుసార్లు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ చేసి చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ బెదిరింపు కాల్స్‌పై రాజాసింగ్ స్పందించారు.
ఇవాళ నాకు రెండు నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజాసింగ్ తెలిపారు. ఈరోజు కాకపోతే రేపు నీ తల నరికేస్తాం ఇన్షాల్లా(అల్లా దయతో) అని వార్నింగ్ ఇచ్చినట్లు రాజాసింగ్ పేర్కొన్నారు. ఇప్పుడు మీ యోగి, మీ మోదీ కూడా మిమ్మల్ని రక్షించలేరు అని దుండగులు బెదిరించినట్లు బీజేపీ ఎమ్మెల్యే తెలిపారు. మొదటి కాల్ మధ్యాహ్నం 3.30 గంటలకు, రెండోసారి మధ్యాహ్నం 3.54 గంటలకు వచ్చినట్లు రాజాసింగ్ పేర్కొన్నారు.