అబిడ్స్, జూలై 29: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన వారు బీఆర్ఎస్ పార్టీ లో చేరేందుకు దండిగా ముందుకు వస్తున్నారని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి నంద కిషోర్ వ్యాస్ బిలాల్ పేర్కొన్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన 30 మంది బీఆర్ఎస్ పార్టీ లో చేరగా వారికి ఆయన పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం, నందకిషోర్ వ్యాస్ బిలాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను చేపడుతున్నారని తెలిపారు.
ఆయా పథకాలతో ప్రజలు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ ఘన విజ యం సాధించి హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. నియోజకవర్గంలో పార్టీ పట్ల రోజు రోజుకు ఆదరణ పెరుగుతున్నదని, నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేసి పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు పాటు పడాలన్నారు. ఆనంద్‌సింగ్, బల్దీప్ సింగ్, రవి కుమార్ పాల్గొన్నారు.