సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ ): పేదింటి ఆత్మగౌరవాన్ని పెంచేలా.. ‘ఇది నా ఇల్లు’ అని తలెత్తుకొని తిరిగేలా.. సకల సౌకర్యాలతో చక్కటి సౌధాలను నిర్మించి.. రూపాయి కూడా చెల్లించే అవసరం లేకుండా అద్భుతమైన డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించి.. పేదలకు దశలవారీగా పూర్తి ఉచితంగా పంపిణీ చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. రూ. 9,600 కోట్ల రూపాయల వ్యయంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఎంతో విలువైన స్థలాల్లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టింది.
నిర్మించిన గృహాలను ఎంతో పారదర్శకంగా, రాజకీయ ప్రమేయం లేకుండా, పార్టీలకు అతీతంగా ర్యాండమైజేషన్ విధానంలో ఆన్లైన్ డ్రా నిర్వహించి.. లబ్ధిదారులను ఎంపిక చేసి.. అందజేస్తున్నది. మొదటి విడుతలో 11,700 మందికి, రెండో విడుతలో 13,200 మందికి ఇండ్లను మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. మూడో విడుతలో 36,884 మందిని ఎంపిక చేశామని, సోమవారం 19,020 మందికి, 5న మిగిలిన వారికి గృహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Pp