జవహర్‌నగర్, సెప్టెంబర్ 2 : అరుణోదయకాలనీలో(Arunodaya Colony) దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి అరుణోదయకాలనీలో చోటుచేసుకుంది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అరుణోదయకాలనీలో ఆంజనేయులు కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. ఇటీవల కుమారుడికి వివాహం చేశాడు. ఆంజనేయులుకు సైనిక్‌పురిలో మరో ఇల్లు ఉండటంతో ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి అక్కడికి వెళ్లారు.
సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు పగులగొట్టి కనిపించాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని నాలుగు తులాల బంగారం, రూ. 50వేల నగదును(Gold and cash) దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. సీసీ పుటేజీ, హర్డ్డిస్క్ను దొంగలు పగులగొట్టి వెంట తీసుకెళ్లారు. వెంటనే కుటుంబసభ్యులు జవహర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వేలిముద్రలు సేకరించి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.