శామీర్పేట, సెప్టెంబర్ 10 : రేణుకా ఎల్లమ్మ ఆలయంలో(Renuka Ellamma temple) గుర్తు తెలియని దుండ గులు (Thieves) చోరీకి పాల్పడ్డారు. గుడి తాళం పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు(Jewelery) అపహ రించుకుపోయారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ ఎల్లమ్మ గుడికి తాళం విరగొట్టి ఉండడాన్ని ఆలయ నిర్వాహకులు, స్థానికులు గుర్తించి వెంటనే గ్రామ పెద్దలకు, పోలీసులకు సమాచారం అందజేశారు. ఆలయంలో రూ. లక్షా 50 వేల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు(ముక్కుపుడక, శఠగోపం, పళ్లెం, కిరీటాలు, తదితర పూజా సామగ్రి చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.