Robbery | దొంగలు తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేశారు. తమ ఇంటికి తాళం వేసి పెళ్లికి వెళ్లిన ఓ కుటుంబాన్ని ప్లాన్ ప్రకారం లక్ష్యంగా పెట్టుకున్న దొంగలు ఆ ఇంట్లోకి చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
జైన్ స్కూల్ సమీపంలోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు భారీగా బంగారం, వెండి, నగదును అపహరించుకెళ్లారు. తన బంధువుల పెళ్లికి ఆదివారం ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టబడినట్లు బాధితుడు గుర్తించాడు.
ఇంట్లో తనిఖీ చేయగా సుమారు 30 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5 లక్షల నగదు దొంగిలించినట్లు తెలిసింది. బాధితుడు వెంటనే గోషామహల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. గోశామహల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగల కోసం గాలింపు చేపట్టారు.