సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. నగరం నుంచి చాలామంది తమ ఇండ్లకు తాళాలేసి.. సొంత ఊళ్లకు ప్రయాణమవుతారు… ఇదే అదనుగా దొంగలు కూడా స్వైర విహారం చేసే ప్రమాదముంది. తెలంగాణ ఏర్పాటైన తరువాత ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బీఆర్ఎస్ ప్రభుత్వం విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, దొంగతనాలపై ఉక్కుపాదం మోపింది. దీంతో బీఆర్ఎస్ హయంలో దొంగతనాలు తగ్గిపోయాయి… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి దొంగతనాలు, స్నాచింగ్లు మొదలయ్యాయి.
రెండేండ్ల నుంచి ఇవి పెరుగుతూనే ఉన్నాయి. దీంతో పోలీసులు కూడా సంక్రాంతికి ఉరేళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు. పండుగల సమయంలో ఊరెళ్లే వారు జాగ్రతగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నారు. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ప్యూచర్సిటీ పోలీసు కమిషనరేట్ల పరిధిలో నిఘాతోపాటు రాత్రి సమయాల్లో గస్తీ పెంచుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జనసంచారం తక్కువగా ఉండే కాలనీలు, బస్తీలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. అయితే ప్రజలు కూడా తమ వంతు జాగ్రత్తలు పాటించాలని అధికారులు ప్రజలకు సూచనలు జారీచేస్తున్నారు.
ఈ జాగ్రతలు పాటించండి