హైదరాబాద్: హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. గురువారం అర్ధరాత్రి కూకట్పల్లిలోని హైదర్నగర్లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో గర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఏటీఎంలో డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఏటీఎం మెషిన్ తెరుచుకోకపోవడంతో దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఏటీఎంను పరిశీలించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.