కాప్రా, జనవరి 7 : చెట్లను నరకవద్దని, పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ.. సైనిక్‌పురి చిల్డ్రన్స్‌పార్కులో ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు పర్యావరణ ప్రేమికులు, యువకులు వృక్షాలను హత్తుకొని నిరసన తెలిపారు.
చెట్లను ఇష్టానుసారంగా నరికే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రమామెల్కోటే, మనోజ్ఞరెడ్డి, శైలేశ్, కిరణ్, చర్లపల్లి కాలనీల సమాఖ్య సీసీఎస్ ప్రతినిధులు పద్మారెడ్డి, డాక్టర్ కుమారస్వామి, తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.