MLA Rakesh Reddy | బండి సంజయ్‌కు, బీజేపీకి సాయి భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించిన సంఘటనతో ఎలాంటి సంబంధం లేదు. భగీరథ్, బాధితురాలు ఇద్దరూ బావ మరదలు లాగా ఉండేవారంటూ ఓ ఇంటర్వ్యూలో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాళ్లేదో చిన్నపిల్లలు ఫ్రెండ్స్‌ను వాళ్ల మధ్య ఏవో మనస్పర్థలు వస్తే మీరేమో పైపులు పట్టుకొని, బొంగులు పట్టుకొని వస్తున్నారు. కలిసి గుళ్లల్లోకి పోయిర్రని మేనత్తనే అన్నది కదా.. కుటుంబ సంబంధాలేమో బెడిసి కొట్టినయ్. వాళ్లు మళ్లీ కలవాలి.. రెండు కుటుంబాల మీద ఏవో మనస్పర్థలు వస్తుంటయి.. చిన్నపిల్లలేం కాదు.. రెండు మూడు నెలలు తక్కువ. రెండేళ్లు స్నేహితులుగా ఉన్నారు.
చాలా మంది ఇప్పుడున్న అమ్మాయిలు ఫ్రెండ్స్‌గా తిరుగుతుర్రు. ఇప్పుడు ఫ్రెండ్స్‌గా ఉండటం కొత్తగా ఇదొక ట్రెండ్. నిజంగా ఏమైన ప్రేమలుంటే. ఆ అమ్మాయికి ఇంకా మూడు నెలలేమో తక్కువున్నది.. పూర్తయ్యాక పెళ్లి చేసుకోవచ్చు. మేనళ్లుడు అనుకుంట అత్తా మామనే తింపిర్రు కదా.. తిరుపతి, శ్రీశైలం. నేను తప్పుబట్టడం లేదు. కుటుంబ బంధుత్వాల విషయం.. దయచేసి మీడియా కూడా సంయమనం పాటించాలి. మీకు దొరికిందికదా అని అన్ని మరిచిపోయిర్రంటూ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
Chattogram | బంగ్లాదేశ్‌లో భారతీయ దౌత్యవేత్త అనుమానాస్పద మృతి.. గుండె పోటే కారణమా..?
US Tragedy | అమెరికాలో బాపట్ల టెక్కీ మృతి.. తల్లిదండ్రులు, తమ్ముడికి తీవ్ర గాయాలు