హైదరాబాద్ : నగరంలో రోజారోజుకు పెరిగిపోతున్న దొంగతనాలు పెరిగిపోతున్నాయి. వరుస చోరీలతో నగర వాసులు బెంబేలెత్తి పోతున్నారు. కుత్బుల్లాపూర్లో వైష్ణవి నగర్ వరుసగా మూడు రోజులుగా దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా రెండు రోజుల నుండి అపార్ట్మెంట్లలో సైకిల్ దొంగతనాలు జరుగుతున్నాయి. నిన్న దుండగులు ఏకంగా గణపతి ఆలయంకే కన్నం వేయడం చర్చనీయాంశంగా మారింది.
సూరారంలోని వైష్ణవి నగర్లో గల గణపతి ఆలయంలో హుండీ దొంగిలించి అడవిలోకి తీసుకెళ్లి పగలగొట్టి డబ్బులతో ఉదయించారు. దాదాపు రూ. 25,000వరకు నగదు ఉన్నట్లు ఆలయ అర్చకులు, కాలనీ వాసులు తెలిపారు. అసలు పోలీస్ ఉన్నారో లేదో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెగ్యులర్గా పెట్రోలింగ్ చేసేవారు. ఇప్పుడు అసలు పెట్రోలింగ్ అనే మాటనే లేదంటున్నారు. ఇప్పటికైనా గస్తీని పెంచాలని స్థానికులు కోరుతున్నారు.