దుండిగల్,జూన్23 : కుటుంబకలహాల నేపథ్యంలో చెరువులో(Pond) దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహితను యూట్యూబ్ రిపోర్టర్(YouTuber) రక్షించాడు. ఈ సంఘటన మేడ్చల్(Medchal) జిల్లా సూరారం(Suraram ps) పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..కామారెడ్డి ప్రాంతానికి చెందిన తన్నీరు శ్రీనివాస్, పద్మ(39) దంపతులు. బతుకుదెరువు కోసం నగరానికి 15 ఏండ్ల క్రితం వలసవచ్చి నగరశివారు ప్రాంతం సూరారం కాలనీలోని ముత్యాలబస్తీలో ఉంటున్నారు. వీరికి 15 ఏండ్ల వయస్సున్న కుమార్తె ఉంది. దంపతులు ఇద్దరు కూలీపనులు చేసుకుంటూ ఉపాధిని పొందుతున్నారు.
ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఈ మధ్యకాలంలో దంపతుల మధ్యన గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రిసైతం గొడవపడ్డారు. ఆదివారం తెల్లవారు జామున ఇద్దరిమధ్యన మరోసారి గొడవ జరుగుగా పద్మను భర్త కోప్పడ్డాడు. దీంతో మనస్థాపం చెందిన ఆమె ఉదయం 7 గంటల ప్రాంతంలో సూరారం కట్టమైసమ్మ ఆలయం ముందు ఉన్న లింగంచెరువు వద్దకు చేరుకుని అందులో దూకింది. అప్పటికే అక్కడ ఉన్న వారిలో ఏ ఒక్కరు ఆమెను రక్షించే ప్రయత్నం చేయకుండా వీడియోలు తీస్తున్నారు.
అదే సమయంలో న్యూస్ కవరేజీ కోసం అక్కడకు చేరుకున్న ఐ34 న్యూస్ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ పల్నాటి శివకుమార్ ధైర్యం చేసి తాడు సహాయంతో చెరువులోకి దిగి పద్మను కాపాడాడు(Saved woman). ఈ లోగా పోలీసులు అక్కడకి చేరుకుని పద్మను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి, కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించారు. కాగా రిపోర్టర్ పల్నాటి శివకుమార్ మహిళ ప్రాణం కాపాడటం పట్ల అభినందనలు వెల్లువెత్తాయి.
ఆత్మహత్య చేసుకోబోయిన మహిళ.. కాపాడిన రిపోర్టర్
హైదరాబాద్ – సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్ట మైసమ్మ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళ.. అప్పుడే అక్కడకు చేరుకున్న రిపోర్టర్ పల్నాటి శివకుమార్ తాడు సాయంతో ఆ మహిళను ఓడ్డుకు చేర్చాడు. అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి… pic.twitter.com/NfSF5fPmts
— Telugu Scribe (@TeluguScribe) June 23, 2024