కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో గోదావరి జలాలు పంపిణీ జరిగే వాటర్ వాల్వ్ పగిలిపోయింది. దీంతో నీరంతా రోడ్డుపై పారింది. వాటర్ వర్క్ అధికారి నీరు పోతుండగానే సరఫరా నిలిపివేయకుండా వాల్వ్‌ను సరిచేసేందుకు ఓ కార్మికుడిని లోపలికి పంపించారు. నీటి ప్రవాహానికి ఉక్కిరిబిక్కిరైన కార్మికుడు ఊపిరిరాడక పైకి వచ్చేశాడు. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండానే ఇలా కార్మికుడితో పనిచేయించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు గేట్‌వాల్వ్ మరమ్మతులు పూర్తి చేయకపోవడంతో నీరంతా రోడ్డుపై ఏరులై పారింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అంబులెన్సులూ కదలలేకపోయాయి.
-సిటీబ్యూరో