ప్రజల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక శాంతి భద్రతల విషయంలోఎన్నో సందేహాలు ఉండేవనీ, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణతో పాటు శాంతి భద్రతలు బలపడ్డాయన్నారు.
- హోం మంత్రి మహమూద్ అలీ
- మేడిపల్లిలో రూ.78 కోట్లతో నిర్మిస్తున్న కమిషనరేట్ భవన నిర్మాణానికి
- శంకుస్థాపన చేసిన మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి
పీర్జాదిగూడ, అక్టోబర్ 5: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక శాంతి భద్రతల విషయంలోఎన్నో సందేహాలు ఉండేవనీ, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణతో పాటు శాంతి భద్రతలు బలపడ్డాయన్నారు. మేడిపల్లిలో రూ.78 కోట్లతో సుమారు 60 ఎకరాల స్థలంలో నూతనంగా చేపడుతున్న అధునాతన రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయ నిర్మాణానికి ఆయన మంత్రి మల్లారెడ్డితో కలిసి గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా పోలీసులతో ప్రజలకు మంచి అనుబంధం ఏర్పడిందన్నారు.
ప్రజల రక్షణ, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిషలు పాటుపడుతున్నదని తెలిపారు. మేడిపల్లిలో నిర్మించే రాచకొండ కమిషనరేట్ దేశంలోనే అతిపెద్ద విస్తీర్ణం గల కార్యాలయం అవుతుందన్నారు. తెలంగాణలో శాంతిభద్రతల వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. మహిళలకు పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాచకొండ పోలీసు కమిషనరేట్ నూతన భవన నిర్మాణాన్ని మేడ్చల్ నియోజకవర్గం మేడిపల్లిలో చేపట్టడం ఆనందంగా ఉన్నదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీస్ విభాగాలు, ప్రత్యేక పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయడంతో మహిళలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని తెలిపారు. రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. మేడిపల్లిలోని సువిశాల ప్రాంతంలో నూతన కమిషనరేట్ భవన నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. మహిళల పట్ల జరిగే నేరాలు, హింసను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దయానంద్, డీసీపీ (ట్రాఫిక్) అభిషేక్ మహంతి, మల్కాజిగిరి జోన్ డీసీపీ జానకీ, సైబర్ క్రైమ్ డీసీపీ అనురాధ, ఎస్ఓటీ డీసీపీ గిరిధర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దర్గ దయాకర్‌రెడ్డి, బోడుప్పల్, జవహర్‌నగర్ మేయర్లు సామల బుచ్చిరెడ్డి, కావ్య, పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్‌గౌడ్, పోచారం చైర్మన్ కొండల్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

