బండ్లగూడ, జూలై 16: ఉన్న భూమి కోల్పోతున్నాం.. మాకు సరైన నష్ట పరిహారం చెల్లించాలంటున్నారు మూసీ భూ బాధితులు. గాంధీ సరోవర్, మూసీ అభివృద్ధి మొదటి దశ పనుల్లో భాగంగా రాజేంద్రనగర్ మండలం పరిధిలోని హైదర్గూడ గ్రామానికి చెందిన సుమారు 30 ఎకరాల స్థలానికి సంబంధించి మూసీ భూ బాధితలతో మూసీ అభివృద్ధి శాఖ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వెంకట్రెడ్డి, ఆర్డీవో శ్రీధర్ ఆధ్వర్యంలో సమావేశం అయ్యారు. అధికారులు మాట్లాడుతూ..
మూసీ అభివృద్ధికి భూములు కోల్పోతున్న వారికి నష్ట పరిహారం కింద గజానికి 51 వేలు, లేదా ఎకరానికి 20 కోట్ల వరకు ఇచ్చేందుకు సిద్ధ్దంగా ఉన్నామని తెలిపారు. లేదంటే ఈ డబ్బులను కోర్టులో జమ చేసి భూ సేకరణ చేయాల్సి ఉంటుందని వివరించారు. దీనిపై అభిప్రాయం త్వరగా చెప్పాలని బాధితులకు అధికారులు సూచించారు.