ప్రైవేట్ ఆగడాలకు అడ్డుకట్టేది?
ప్రైవేట్ స్కూల్స్ నగరంలో హద్దు మీరుతున్నాయి. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయంటూ ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం, తమకు నచ్చినట్టుగా విద్యాబోధనలో మార్పులు చేస్తూ పేట్రేగిపోతున్నాయి.
- సైదాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో మతం పేరుతో హోంవర్క్
- కల్మా రాయాలంటూ 2వ తరగతి విద్యార్థిపై ఒత్తిడి
- యాజమాన్యాన్ని నిలదీసిన పేరెంట్స్, విద్యార్థి సంఘాలు
- టీచర్‌ను ఉద్యోగం నుంచి తొలిగించినట్టు ప్రకటించిన యాజమాన్యం
- పట్టించుకోని జిల్లా విద్యాశాఖ అధికారులు
సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూల్స్ నగరంలో హద్దు మీరుతున్నాయి. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయంటూ ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం, తమకు నచ్చినట్టుగా విద్యాబోధనలో మార్పులు చేస్తూ పేట్రేగిపోతున్నాయి. తాజాగా సైదాబాద్‌లో ఓ టీచర్ 2వ తరగతి చదువుతున్న విద్యార్థికి నిబంధనలకు విరుద్ధంగా కల్మా రాయాలని హోంవర్క్ ఇవ్వడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. చిన్నారి డైరీలో కల్మా కంఠస్థం చేయాలంటూ హోం వర్క్ ఇవ్వడంతో గురువారం తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. అప్పటికే విద్యార్థి సంఘాలు ఆ స్కూల్ ఎదుట నిరసన చేపట్టాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా.. విద్యార్థి సంఘాల నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. అనంతరం ఆందోళనకారులను పోలీసులు వ్యాన్‌లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.
అనంతరం స్కూల్ యాజమాన్యం.. వివాదానికి కారణమైన టీచర్‌ను ఉద్యోగం నుంచి తొలిగిస్తున్నట్టు ప్రకటించింది.. నిబంధనలకు పాతర పాఠశాల స్థాపించాలంటే విద్యాశాఖ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మద్యం దుకాణాలు, ప్రార్ధన మందిరాలకు పాఠశాల దూరంగా ఉండాలి. 24 శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) తీసుకోవాలి. భవన రిజిస్ట్రేషన్, ఫైర్ సేఫ్టీ తప్పనిసరి. అయితే నగరంలో చాలా పాఠశాలలను కేవలం లాభార్జన మీదనే నెలకొల్పుతున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 2,374 ప్రైవేట్ స్కూళ్లు ఉంటే ఇందులో 1,897 పాఠశాలలకే గుర్తింపు ఉంది.
ఈ విషయం విద్యా శాఖాధికాల దృష్టిలో ఉన్నప్పటికీ డీఈఓ, డిప్యూటీ ఈఓఎస్లు, డిప్యూటీ ఐఓఎస్‌లు మౌనం వహిస్తున్నారు. విద్యాశాఖ ప్రమాణాలు పాటించకుండా, వివిధ శాఖల నుంచి అనుమతి తీసుకోకుండా పాఠశాలలను నిర్వహిస్తున్నా తమకు పట్టన్నట్టు వ్యవహరిస్తున్నారు. డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్ పండిట్ కోర్సులను పూర్తిచేయని వారిని ఉపాధ్యాయులుగా నియమించుకుని పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారని ఫిర్యాదులు అందినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మామూళ్లు అందడంతో అధికారులు అటువైపునకు తొంగి చూడటం లేదనే ఆరోపణులన్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

