బుల్డోజర్లు వస్తున్నాయ్
గ్రేటర్ హైదరాబాద్‌లో చిరువ్యాపారులపై బల్దియా మరోసారి యుద్ధం ప్రకటించింది. మాది ఆక్రమణ కాదు..ఆకలి కేక..మాకు వెండింగ్ జోన్లు కేటాయించిన తర్వాతే కూల్చివేతల స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్న బాధితుల విజ్ఞప్తులను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండానే గడిచిన కొన్ని వారాలుగా చిరు వ్యాపారులపై బుల్డోజర్లతో జీహెచ్ఎంసీ విరుచుకుపడుతున్నది.
- నేడు చిరు వ్యాపారులపై దండెత్తనున్న బల్దియా
- బాధితులు కన్నీరుమున్నీరవుతున్నా.. అధికారుల కఠిన వైఖరి
- ప్రత్యామ్నాయం చూపకుండా తీసుకుంటున్న చర్యలపై విమర్శలు
సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్‌లో చిరువ్యాపారులపై బల్దియా మరోసారి యుద్ధం ప్రకటించింది. మాది ఆక్రమణ కాదు..ఆకలి కేక..మాకు వెండింగ్ జోన్లు కేటాయించిన తర్వాతే కూల్చివేతల స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్న బాధితుల విజ్ఞప్తులను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండానే గడిచిన కొన్ని వారాలుగా చిరు వ్యాపారులపై బుల్డోజర్లతో జీహెచ్ఎంసీ విరుచుకుపడుతున్నది.
ఏళ్ల తరబడి వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం, కనీసం సామాన్లు సర్దుకునే అవకాశం ఇవ్వడం లేదంటూ బాధితులు మండిపడుతున్నా.. ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన డ్రైవ్ సమయంలో అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ బల్దియా యంత్రాంగం మాత్రం వెనక్కుతగ్గడం లేదు. శనివారం 8 చోట్ల స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నది. ఈ మేరకు విజిలెన్స్ విభాగం పోలీసుల సహాయంతో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సమన్వయం చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

