శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 12: ద్విచక్రవాహనం అదుపుతప్పి వాహనదారుడు మృతిచెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…గౌలిదొడ్డి జర్నలిస్టు కాలనీ ప్రాంతానికి చెందిన ఫకీర్ సాహెబ్(22) అతడి స్నేహితుడు సాయితో కలిసి బైక్‌పై గౌలిదొడ్డి నుంచి నానక్‌రాంగూడ వైపు వెళ్తున్నారు.
మార్గమధ్యలో వాహనం అదుపుతప్పి క్యూసిటీ వద్ద రోడ్డుపై నిలిపిఉన్న జీహెచ్ఎంసీ శానిటేషన్ వాహనాన్ని వెనుకనుంచి ఢీకొట్టారు. దీంతో తీవ్రగాయాలకు గురైన ఫకీర్ సాహెబ్, సాయిలను సమీపంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఫకీర్ సాహెబ్ మృతిచెందగా, సాయి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.