కంటోన్మెంట్, జనవరి 16 : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మూడు రోజులపాటు నిర్వహించిన అంతర్జాతీయ కైట్స్, స్వీట్స్ ఫెస్టివల్ సోమవారం ముగిసింది. ఈ మూడు రోజుల్లో నగర నలుమూలలకు చెందిన సుమారు 9లక్షల మంది సందర్శకులు ఫెస్టివల్‌ను తిలకించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముగింపు సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ రమేశ్ నాయుడు, పర్యాటక శాఖ డైరెక్టర్ నిఖిల, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ దేశ విదేశాల నుంచి వచ్చిన కైట్ ఫ్లయర్స్తోపాటు కళా బృందాలకు నేతృత్వం వహించిన కళాకారులకు అవార్డులను అందజేసి, సత్కరించారు.