సుల్తాన్‌బజార్, మే 31: ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున ఆస్తమా రోగుల కోసం బత్తిని కుటుంబం చేప మందును పంపిణీ చేస్తున్నది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున మత్య్సశాఖ పూర్తి సహకారం అందిస్తూ వస్తున్నది. ఈ ఏడాది కూడా బత్తిని కుటుంబం చేప మందు పంపిణీకి సన్నద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో నల్గొండ, ఏపీలోని ఏలూరు, వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి కొర్రమీను చేప పిల్లలను తీసుకొస్తున్నట్లు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఒక్కో కొర్ర మీను ధర రూ. 40 ఉంటుందన్నారు. కార్యక్రమం ప్రారంభరోజైన 8న ఉదయం 6 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి కొర్రమీను చేప పిల్లలను తీసుకొస్తామన్నారు.