రవీంద్రభారతి, ఫిబ్రవరి 8: కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ భూములను బడాబాబులకు అమ్మడానికి సిద్ధం అవుతున్నదని, ఈ నిర్ణయాన్ని విరమించుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో బీసీ నేతలు నీల వెంకటేశ్, సి.రాజేందర్ సభా అధ్యక్షతన జరిగిన విద్యార్థుల కోర్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థులను అద్దె భవనాల్లో ఉంచుతున్న ప్రభుత్వం..
మరోవైపు సర్కార్ భూములను బడాబాబులకు అమ్మేస్తామంటే ఖబడ్దార్ అని అన్నారు. 320 బీసీ సంక్షేమ హాస్టల్స్ ఉంటే 27 సంవత్సరాల నుంచి ఒక్క ప్రభుత్వ హాస్టల్స్ నిర్మించలేదని ఆయన ధ్వజమెత్తారు. అదనంగా ఇంకా 150 బీసీ హాస్టల్స్‌ను మంజూరు చేయడంతో పాటు బీసీలకు 240 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ నాయకులు.. అనంతయ్య, శివకుమార్‌యాదవ్, మల్లేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.