సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు మళ్లీ 40డిగ్రీలకు చేరుకోవడంతో నగర వాతావరణం వేడెక్కింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27.0 డిగ్రీలు, గాలిలో తేమ 33 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.