మాగంటి ఇంట మరో ప్రమాదం
ఓఆర్ఆర్పై దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూతుర్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ చక్రం ఊడిపోవడంతో వెనుక నుంచి వచ్చిన ఫార్చునర్ కారు అదుపు తప్పి డీసీఎంను ఢీకొట్టింది. కారులో ఉన్న వాళ్లందరు గాయాలతో బయటపడ్డారనే విషయం తెలియగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
- ఓఆర్ఆర్పై డీసీఎంను ఢీకొట్టిన కారు
- గాయాలతో బయటపడ్డ మాగంటి కూతుళ్లు
మణికొండ, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఓఆర్ఆర్పై దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూతుర్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ చక్రం ఊడిపోవడంతో వెనుక నుంచి వచ్చిన ఫార్చునర్ కారు అదుపు తప్పి డీసీఎంను ఢీకొట్టింది. కారులో ఉన్న వాళ్లందరు గాయాలతో బయటపడ్డారనే విషయం తెలియగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి మాగంటి అక్షిత నాగ, మాగంటి దిశిర, దుర్గ సాయి అరికెపుడి, మేడిపల్లి అభిరామ్రెడ్డి తదితరులు ఫార్చునర్ కారులో శంషాబాద్లోని ఎయిర్ పోర్టుకు నుంచి ఓఆర్ఆర్ మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్తున్నారు.
నార్సింగి ప్రాంతంలోని టీజీపీఏ జంక్షన్ సమీపంలో ఐస్తో వెళ్తున్న డీసీఎం వెనుక టైరు బయటకు రావడంతో డీసీఎం అకస్మాత్తుగా నెమ్మదించింది. దీంతో వెనుక నుంచి వస్తున్న ఫార్చునర్ కారు అదుపు తప్పి డీసీఎం వ్యాన్ను ఢీకొట్టింది. కారును దుర్గసాయి నడుపుతున్నాడు. కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. అక్షితను గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చేర్పించగా కోలుకుందని, ఎవరికి ప్రాణాపాయం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. స్నేహితులను ఎయిర్పోర్టులో దింపి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

