 
                                                            జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గెలుపే లక్ష్యంగా గురువారం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇంటింటి ప్రచారం, పాదయాత్రలు నిర్వహించారు. ఓ వైపు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూనే.. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
– జూబ్లీహిల్స్ జోన్ బృందం, అక్టోబర్ 30
మాగంటి సునీత విజయం తథ్యం
ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
సికింద్రాబాద్, అక్టోబర్ 30: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ విజయం తథ్యమని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. గురువారం యూసుఫ్‌గూడ డివిజన్లో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటువేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్‌కుమార్, కార్పొరేటర్లు హేమ, ప్రసన్న లక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ను గెలిపించండి
జూబ్లీహిల్స్ శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పన్నాల దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్, రాష్ట్ర నాయకుడు సాయిజన్‌శేఖర్, మాజీ కార్పొరేటర్ జీ శ్రీనివాస్‌రెడ్డి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
షేక్‌పేటలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
బండ్లగూడ, అక్టోబర్ 30: కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను గెలిపించాలని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రావుల కోళ్ల నాగరాజు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. షేక్‌పేటలో గురువారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు శాంతి నాయక్, శాంతకుమార్, రాజు, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.
 
                            