యాచకురాలి హత్య
భిక్షాటన చేసుకుంటూ.. జీవనాన్ని కొనసాగిస్తున్న ఓ మహిళ రాచకొండ పోలీసు కమిషనరేట్ క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో దారుణ హత్యకు గురైంది. ఆమెతో పాటు భిక్షాటన చేసుకునే వ్యక్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
మన్సూరాబాద్, మార్చి 10: భిక్షాటన చేసుకుంటూ.. జీవనాన్ని కొనసాగిస్తున్న ఓ మహిళ రాచకొండ పోలీసు కమిషనరేట్ క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో దారుణ హత్యకు గురైంది. ఆమెతో పాటు భిక్షాటన చేసుకునే వ్యక్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాచకొండ పోలీసు కమిషనరేట్ క్యాంపు కార్యాలయం సమీపంలోని ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న ఈ చలాన్ కాంపౌండింగ్ బూత్ వద్ద గుర్తు తెలియని ఓ మహిళ (35) దారుణ హత్యకు గురైనట్లు ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సదరు మహిళ అల్కాపురి చౌరస్తా నుంచి రాక్‌టౌన్‌కాలనీకి వెళ్లే మార్గంలో ప్రతిరోజూ భిక్షాటన చేసుకునే మహిళగా గుర్తించారు. మహిళను దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేశారు. ఆ మహిళతోనే ఉండే భిక్షాటన చేసే బసంత్ ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రతిరోజూ వీరిద్దరూ ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న ఈ చలాన్ కాంపౌండింగ్ బూత్ వద్ద నిద్రిస్తుంటారని పోలీసుల విచారణలో తేలింది. ఆదివారం తెల్లవారు జామున ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు.
హత్య చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఓ వ్యక్తి ఉదయం 6 గంటల సమయంలో రక్తం అంటిన మరకలతో వచ్చి.. సాయినగర్ కాలనీ రోడ్డు నం. 1 సమీపంలో ఉన్న సిల్వర్ ప్లేట్ హోటల్ వద్ద టీతాగి వెళ్లినట్లు కొందరు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. హత్య చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు డాగ్ స్కాడ్, క్లూస్ టీంను రప్పించి.. ఆధారాలను సేకరించారు. హత్య జరిగిన కొద్ది దూరంలోనే మహిళ గొంతును కోసేందుకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ఆరు టీమ్‌లను ఎల్బీనగర్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

