హైదరాబాద్ : మేడ్చల్(Medchal) మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఇద్దరు వ్యక్తుల గోంతు కోసి(Slitting throats)పారిపోయారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్ రాష్ట్రానికి చెందిన పవన్ కుమార్, సంతోష్ అనే వ్యక్తులు మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టాపూర్‌లో నివాసముంటున్నారు. రోజువారి కూలీ పనులకు వెళ్తూ జీవనం కొనసాగిస్తున్నారు.
కాగా, బుధవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న పవన్, సంతోష్‌పై గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి పారిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వారిలో సంతోష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | కంప్యూటర్లను కనిపెట్టడంలో రేవంత్ రెడ్డి బిజీ.. కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
Breast Cancer | ‘రొమ్ము క్యాన్సర్’ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తూ.. వేల మరణాలను ఆపుతున్న అంధులు
KTR | అంకెలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు.. కేసీఆర్ సాధించిన విజయాలు ఎప్పటికీ చెదిరిపోవు : కేటీఆర్