గచ్చిబౌలి స్టేడియంలో శనివారం 72వ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి. 110 దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు పాల్గొని.. తమ దేశ ఆహార్యం.. సంస్కృతీ, సంప్రదాయాలతో సందడి చేశారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఏషియా దేశాల సుందరీమణులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన, డప్పు, ఒగ్గు డోలు విన్యాసాలు అలరించాయి. మిస్ ఇండియా నందిని గుప్తా కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
-సిటీబ్యూరో, మే 10(నమస్తేతెలంగాణ)