Siripuram Yadayya | ఓయూలో ఘనంగా సిరిపురం యాదయ్య 12వ వర్ధంతి
తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుడు సిరిపురం యాదయ్యకు ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నివాళి అర్పించారు. యాదయ్య 12వ వర్ధంతి సందర్భంగా ఆత్మబలిదానం చేసుకున్న ఓయూ ఎన్సీసీ గేటు సమీపంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సంస్మరణ సభ నిర్వహించి, అంజలి ఘటించారు.
ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుడు సిరిపురం యాదయ్యకు ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నివాళి అర్పించారు. యాదయ్య 12వ వర్ధంతి సందర్భంగా ఆత్మబలిదానం చేసుకున్న ఓయూ ఎన్సీసీ గేటు సమీపంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సంస్మరణ సభ నిర్వహించి, అంజలి ఘటించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్‌భాస్కర్, వి. హన్మంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యాదయ్య చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆత్మత్యాగం చేసిన ప్రదేశంలోనే యాదయ్య విగ్రహాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులను కోరారు. యాదయ్య చేసిన త్యాగం తెలంగాణ ఉద్యమ చరిత్రలో నిలిచిపోయిందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతి సాయిజెన్‌శేఖర్, పావని వినయ్‌కుమార్, పద్మవెంకట్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ చైర్మెన్ బీఎస్ రాములు, ఓయూ సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ బాలకిషన్, బీజేపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, టీపోపా అధ్యక్షుడు పుట్టా పాండురంగయ్య, పద్మశాలి యువజన సంఘం నాయకులు గుండేటి శ్రీధర్, బోగ జగదీశ్, ఓయూజేఏసీ నేతలు బాలకృష్ణ నేత, ఎనుగంటి రాజు నేత, యాదయ్య స్మారక సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ వెంకటరాజయ్య తదితరులు హాజరయ్యారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

