సనత్‌నగర్‌లో బీఆర్ఎస్దే.. హ్యాట్రిక్ పక్కా
భారీ మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని సనత్‌నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆయన మంగళవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
- తలసాని శ్రీనివాస్ యాదవ్
- సనత్‌నగర్ నియోజకవర్గంలో ప్రచార చివరి ఘట్టంగా భారీ బైక్ ర్యాలీ
- వేలాదిగా పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు
బేగంపేట్ నవంబర్ 28: భారీ మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని సనత్‌నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆయన మంగళవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పద్మారావునగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ఈ ర్యాలీని ప్రారంభించారు. ముషీరాబాద్, కృష్ణానగర్ కాలనీ, గాంధీనగర్ పోలీస్‌స్టేషన్, జబ్బార్ కాంప్లెక్స్, సిటీలైట్ హోటల్, మోండా మార్కెట్, మహంకాళి టెంపుల్, మినిస్టర్ రోడ్డు, రసూల్‌పుర జంక్షన్, పాటిగడ్డ, ప్రకాశ్‌నగర్, బేగంపేట్, గ్రీన్ పార్కు హోటల్, కనకదుర్గ దేవాలయం, సత్యం థియేటర్, ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్, బల్కంపేట్ టెంపుల్, ఫతేనగర్ బ్రిడ్జి సనత్‌నగర్ బస్టాప్, జెక్ కాలనీ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.
సుమారు 5 కిలో మీటర్ల మేర పార్టీ శ్రేణులు బైక్‌లతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రి తలసాని జీపు ఓపెన్ టాప్ ప్రచార రథంపై నిల్చొని ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధిలో వెనక బడిన సనత్‌నగర్ నియోజకవర్గాన్ని తొమ్మిదిన్నరేండ్ల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. అధ్వాహ్నంగా ఉన్న సీసీ రోడ్లను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచిన విషయాలను చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

