TGSRTC | శబరిమల వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. శబరిమల యాత్రకు బస్సు బుక్ చేసుకుటే ఒక గురుస్వామి, పదేండ్లలోపు ఇద్దరు మణికంఠ స్వాములకు, ఇద్దరు వంటవాళ్లకు, ఒక అటెండెంట్‌కు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. అలాగే వివాహాది శుభకార్యాలకు, శబరి యాత్ర, విహారయాత్రలకు బస్సులు అద్దెకు తీసుకునే వారికి రుసుమును 15 నుంచి 20 శాతం తగ్గించింది.
కిలోమీటర్ ప్రకారం సూపర్ లగ్జరీ ధర రూ.65 నుంచి రూ.59కి, రాజధాని ధర రూ.84 నుంచి రూ.77కి తగ్గించింది. గ్రేటర్ హైదరాబాద్ జనరల్ బస్ పాస్ ఎక్స్‌ప్రెస్, డీలక్స్ పుష్పక్ పాస్ ఉన్న ప్రయాణికులు అట్టి పాస్ చూపించి ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీని పొందవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణిలకు బీహెచ్ఈఎల్ డిపో మేనేజర్ సూచించారు. మరిన్ని వివరాలకు 9652473037, 7382837094, 9959226149 నంబర్లకు సంప్రదించాలన్నారు.