సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): పర్యాటక స్థలాల పరిశుభ్రత విషయంలో అధికారుల లోపాలు, ఏజెన్సీల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ‘టూరిజం స్థలాల్లో ప్రైవేట్ రాజ్యం శీర్షికన ‘నమస్తే’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించగా, అధికారులు స్పందించారు. తొమ్మిది ప్యాకేజీల్లో 73.75 కిలోమీటర్ల మేర రెండు ఏజెన్సీలు పారిశుధ్య నిర్వహణ బాధ్యతలు రెండు ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ అప్పగించింది.
ఈ ఏజెన్సీల నిర్ణీత గడువు ముగిసినా.. దాదాపు ఏడాది కాలంగా వారితోనే నడిపిస్తుండడం, ఆశించిన స్థాయిలో పారిశుధ్య నిర్వహణ లేకపోవడంపై ఫిర్యాదులు వస్తున్నట్లు ‘నమస్తే’ కథనంలో వచ్చింది. తక్షణమే స్పందించిన శానిటేషన్ విభాగం ముఖ్య అధికారులు వెంటనే టెండర్లు పిలిచి కొత్త వారికి పనులు అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఖైరతాబాద్, చార్మినార్ జోన్లో టూరిజం స్థలాల్లో పారిశుధ్య నిర్వహణకు టెండర్లు పిలిచారు.