సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.9, గరిష్ఠం 17.8 డిగ్రీలు, గాలిలో తేమ 60% నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా, బుధవారం సాయంత్రం నగరంలోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.