సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలిపులి పంజా విసురుతున్నది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.6, కనిష్ఠం 15.2 డిగ్రీలు, గాలిలో తేమ 36 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా, రాజేంద్రనగర్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 10.5 డిగ్రీలుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.