కందుకూరుకు జాతీయ స్థాయిలో గుర్తింపు
పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కందుకూరు, ఏప్రిల్ 19 : రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట్ గ్రామంలో రూ. 1.35 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్ కృషితో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో కందుకూరు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినట్లు తెలిపారు. ఫార్మాకు భూములు కేటాయించిన రైతుల కృషి అమోఘమని పేర్కొన్నారు. రైతుల కుటుంబంలోని యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించి, ఇండ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నదని, ఓర్వలేని బీజేపీ నాయకులు కేంద్రం నిధులుగా పేర్కొనడం సిగ్గుగా ఉందని చెప్పారు .
రూ. 45 కోట్ల చెక్కులు పంపిణీ..
798 స్వయం సంఘాలకు రూ.39 కోట్ల 32 లక్షల 62 వేలు, బ్యాంక్ లీకేజి రూ.5 కోట్ల 35 లక్షల 60వేలు, కొత్తగూడ, కొత్తూరు, కందుకూరు, పులిమామిడి డ్వాక్రా సంఘాలకు రూ. 10లక్షల చొప్పున 80 లక్షల చెక్కులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, మార్కెట్ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు పామ మహేందర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ రాములు, డైరెక్టర్లు పొట్టి ఆనంద్, సామ ప్రకాశ్‌రెడ్డి, పారిజాతం, తాసీల్దార్ ఎస్.జ్యోతి, పీడీ ప్రభాకర్, ఎంపీడీఓ నర్సింలు, సర్పంచ్ జ్యోతి శేఖర్, ఎంపీటీసీ రాములు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
మహేశ్వరం, ఏప్రిల్ 19: ఈనెల 27న జరిగే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మహేశ్వరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జడ్పీచైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డితో కలిసి పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ జెండాలను ఎగువేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునితా ఆంధ్యానాయక్, సహకార బ్యాంక్ చైర్మన్ మంచెపాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఆంగోత్ రాజూనాయక్, కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్ అలీ, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు కూన యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరిగౌడ్, ప్రధాన కార్యదర్శి నర్సింహ గౌడ్, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్‌గౌడ్, సర్పంచులు, మాజీ సర్పంచులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు ఆసరా..
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు ఆసరా లాంటిదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మన్సాన్పల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మికి అనారోగ్యం బాగలేకపోవడంతో సీఎం రిలీఫ్‌ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు మంజూరైన రూ.60వేల చెక్కును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీనియర్ నాయకులు ఆంజనేయులుగౌడ్, భాస్కర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
మహిళా సంఘాలతో గుర్తింపు
ఆర్కేపురం, ఏప్రిల్ 19: మహిళా సంఘాలు ఏర్పడిన తర్వాత సమాజంలో మహిళలకు గుర్తింపు లభించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. నూతనంగా ఎన్నుకున్న ఆర్కేపురం డివిజన్ అల్కాపురి కాలనీ మహిళా మండలి లోగోను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు సమైక్యంగా ఉంటే ఏదైనా సాధించగలరని తెలిపారు. విద్యతోనే మహిళల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అల్కాపురి మహిళా మండలి అధ్యక్షురాలు కాశీబోట్ల విజయలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ గునుపూడి మాదవిలత, ప్రధాన కార్యదర్శి కండగట్ల హైమావతి, జాయింట్ సెక్రటరీ పి.గాయిత్రి, కోశాధికారి బైరు వెంకటరమణ, ఈసీ మెంబర్స్ పి.గీతాంజలి, సరిత, లత, శాంతి, ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్, నాయకులు మురుకుంట్ల అరవింద్‌శర్మ, సాజీద్, మహిళా అధ్యక్షురాలు లిక్కి ఊర్మిళారెడ్డి, ప్రధాన కార్యదర్శి తాడికొండ అనురాధ పాల్గొన్నారు.
అన్ని వర్గాలకు సమప్రాధాన్యత
పహాడీషరీఫ్, ఏప్రిల్ 19: సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సమప్రాధాన్యతను ఇస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధి ఎర్రకుంటలో రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాది, టీఆర్ఎస్ నాయకులు ఇక్బాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, మజర్ అలీ, యంజాల జనార్దన్, షేక్ అఫ్జల్, బర్కత్ అలీ, రవూఫ్, కొండల్ యాదవ్, పర్హాన్ రాజ్, మన్సూర్ అలీ, తదితరులు పాల్గొన్నారు.