సికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరికి చెందిన 14 ఏండ్ల ఆయూష్ సింగ్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.
ఈ విషయాన్ని ఎమ్మెల్యే సాయన్న దృష్టికి తీసుకెళ్లి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేయించారు. ఆదే విధంగా బాపూజీనగర్‌కు చెందిన వెంకటేశ్ అరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించగా, సీఎంఆర్ఎఫ్ నుంచి ఎల్వోసీ పత్రాలు మంజూరయ్యాయి.
దీంట్లో భాగంగా ఆయూష్సింగ్కు రూ.2లక్షలు, వెంకటేశ్‌కు రూ.1లక్ష చొప్పున మంజూరైన ఎల్వోసీ పత్రాలను సోమవారం ఎమ్మెల్యే సాయన్న లబ్దిదారుల కుటుంబసభ్యులకు అందజేశారు.
ఆదే విధంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని శాంతినగర్ ఆర్యనగర్‌కు చెందిన సువ ర్ణ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1లక్షకు సంబంధించి ఎల్వోసీని నామాలగుండులోని తన క్యాంపు కార్యాలయంలో సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమతో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే కాకుండా ఆరోగ్య శ్రీ పథకం వర్తించని వ్యాధులకు సైతం సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా ఆదుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా నాయకురాలు నివేదిత, నేతలు శంకర్ తదితరులు పాల్గొన్నారు.