ఉప్పల్, నవంబర్ 25: క్రీడలకు తెలంగాణ ప్రభు త్వం తగిన ప్రోత్సాహకాలు అందిస్తుందని ఉప్పల్ ఎమ్మె ల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో ‘తెలంగాణ రీజియన్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్’ మేడిపల్లి మండల యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ‘స్పోర్ట్స్ మీట్’ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించి, వారిలో నైపుణ్యం వెలికితీయడం అభినందనీయమన్నారు. క్రీడలకు తనవంతు తోడ్పాటు అందిస్తామన్నారు.
విద్యాసంస్థలు క్రీడలను ప్రోత్సహిస్తూ, క్రీడాకారులకు అండగా నిలువడం అభినందనీయమన్నారు. క్రీడలలో ప్రతిభచాటేవారికి ప్రభు త్వం తగిన సహకారం అందజేస్తుందన్నారు. విజ్ఞానంతోపాటు, వినోదం పంచే కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమన్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తిని కలిగించి, వారికి తగిన నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి విద్యాసంస్థలో క్రీడలకు ప్రత్యేక సమయం కేటాయించి, ప్రత్యేక శిక్షణ ఉండేలా చూడాలన్నారు. ఉత్తమ క్రీడాకారులను తయారు చేయడంలో విద్యాసంస్థల యాజమాన్యాలు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సలహాదారులు డా.పి.అనంతరెడ్డి, అధ్యక్షుడు రమేశ్, సెక్రటరీ శ్రీనివాసులు, కోశాధికారి రమేశ్‌బాబు, నేతలు జనంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గడ్డం రవికుమార్, సాయిజెన్ శేఖర్, ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్‌రెడ్డి, గరిక సుధాకర్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.