హైదరాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): రైతుల డిమాండ్లు తీర్చిన తర్వాతే రాష్ట్రానికి రావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు డిమాండ్ చేశారు. ఈ నెల 21న అమిత్ షా రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో రైతుల డిమాండ్లను నెరవేర్చాలన్నారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ప్రతి పంట మద్దతు ధరను ఏటా క్వింటాల్‌కు కనీసం రూ.600 పెంచాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరకు చట్టబద్ధత తేవాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.