చర్లపల్లి, నవంబర్ 5 : తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ పలు పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలు పేర్కొన్నారు. ఆదివారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీ, సెయింట్ జోసెఫ్ కాలనీల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కాలనీవాసులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ .. ఉప్పల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రం సాధించని ప్రగతి తెలంగాణ రాష్ట్రం సాధించిందని, అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. మహిళ సాధికారతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
సౌభాగ్యలక్ష్మి పథకంతో పేద మహిళలకు మూడు వేల గౌరవ భృతి ఇచ్చేందుకు మ్యానిఫెస్టోలో పేర్కొన్నారని తెలిపారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రైతు బీమా పథకం ద్వార లక్ష మందికి పైగా రైతులు లబ్ధిపొందారని, 73వేల కోట్లు రైతు బంధు పథ కం ద్వార అందించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల డబుల్‌బెడ్ రూం ఇండ్లు నిర్మించి పంపిణీ చేశారని, గ్రేటర్లో లక్ష ఇండ్లు నిర్మాణం చేపట్టి 70వేల డబుల్‌బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేశారని ఆయన గుర్తు చేశారు.
పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అసరా పెన్షన్‌తో అర్హులైన వారికి చేయూత అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రేషన్‌పై సన్నబియ్యం, నాలుగు వందలకే వంటగ్యాస్ సిలిండర్ రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్‌పై సన్న బియ్యం అందించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి.. ఉప్పల్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి అత్యధిక మెజారిటీ అందించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, నేమూరి మహేశ్‌గౌడ్, కనకరాజుగౌడ్, పాండాల శివకుమార్‌గౌడ్, జాండ్ల సత్తిరెడ్డి, బొడిగె ప్రభుగౌడ్, గిరిబాబు, లక్ష్మారెడ్డి, కొమ్ము సురేశ్, కడియాల బాబు, కొమ్ము రమేశ్, సానెం రాజుగౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, ఆనంద్రాజుగౌడ్, కడియాల అనిల్, సుభాష్, మురళి, పాండు, వెంకట్‌రెడ్డి, నజీర్, పుష్పలత, అలీ, బాలనర్సింహా, సత్తెమ్మ, లలిత, సోమయ్య, ముత్యాలు, రాధకృష్ణతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.