తాండూరు, ఫిబ్రవరి 20 : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తాండూరులో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పైలెట్ రోహిత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మరోఎనిమిది మందిపై తాండూరు పోలీసులు ఎన్నికల నిబంధనలు అతిక్రమించారని పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
తనపై, తన అనుచరులపై రాజకీయ దురుద్దేశంతోనే అక్రమ కేసులు నమోదయ్యాయని.. వాటిని కొట్టేయడంతోపాటు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రోహిత్‌రెడ్డి రాష్ట్ర హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేయగా.. పరిశీలించిన న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కాగా, మాజీ ఎమ్మెల్యేపై పెట్టిన కేసు విచారణ వారం రోజుల తర్వాత జరిగే అవకాశం ఉన్నది. రోహిత్‌రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై తాండూరు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి శ్రీశైల్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉన్నదన్నారు.