సిజేరియన్లపై సీరియస్
సహజ ప్రసవాలు పెంచి, మాతా, శిశువుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఇనిస్టిట్యూషనల్ డెలివరీస్ పెంచడంతో పాటు సిజేరియన్లను తగ్గించేకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వంటి ప్రతిష్టాత్మకమైన పథకాలు గణనీయమైన
ప్రైవేటు దవాఖానల్లోని సీ- సెక్షన్లపై విచారణ
అనవసరంగా చేసినట్లయితే కఠిన చర్యలు
తప్పు రుజువైతే దవాఖాన, వైద్యుల లైసెన్స్ రద్దు
సహజ ప్రసవాలపై వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి
2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు..
ప్రభుత్వ దవాఖానల్లో సీ-సెక్షన్లు 35.4%
ప్రైవేటు దవాఖానల్లో సీ-సెక్షన్లు 81.5%
సిటీబ్యూరో, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): సహజ ప్రసవాలు పెంచి, మాతా, శిశువుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఇనిస్టిట్యూషనల్ డెలివరీస్ పెంచడంతో పాటు సిజేరియన్లను తగ్గించేకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వంటి ప్రతిష్టాత్మకమైన పథకాలు గణనీయమైన ఫలితాలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, ప్రైవేటు దవాఖానల్లో మాత్రం సీ-సెక్షన్లు యధావిధిగా కొనసాగుతుండటాన్ని వైద్య, ఆరోగ్య శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వ దవాఖానలతో పాటు ప్రైవేటు దవాఖానల్లో సైతం సీ-సెక్షన్లను తగ్గించి, సహజ ప్రసవాల సంఖ్యను పెంచాలని ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పలుమార్లు వైద్యాధికారులు, ప్రైవేటు యాజమాన్యాలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రైవేటు దవాఖానల్లో సైతం సిజేరియన్లు తగ్గించి, సహజ ప్రసవాలు పెంచేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఈ మేరకు అన్ని ప్రైవేటు దవాఖానల యాజమాన్యాలతో సమావేశమైన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు రెండు రోజుల క్రితం ప్రైవేటు దవాఖానలకు చెందిన మెడికల్ డైరెక్టర్లు, గైనకాలజిస్టులతో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించింది.
ప్రత్యేక వర్క్‌షాప్..
తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సెక్షన్లు చేయాలని, సాధ్యమైనంత వరకు సహజ ప్రసవాలనే ప్రోత్సహించాలని వైద్యాధికారులు ప్రైవేటు గైనకాలజిస్టులకు సూచించారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వర్క్‌షాప్‌లో వైద్యులకు క్లిష్టమైన పరిస్థితుల్లోనూ సహజ ప్రసవాలు జరిపే మెళకువలు తదితర అంశాలపై శిక్షణ కల్పించారు.
దవాఖానల వారీగా వివరాలు..
- ప్రభుత్వ దవాఖానల్లో 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు సీ-సెక్షన్లు 35.4 శాతం
- ప్రైవేటు దవాఖానల్లో 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు సీ-సెక్షన్లు 81.5 శాతం
సెక్షన్లు చేస్తే చర్యలు తప్పవు
అవసరం లేకున్నా సిజేరియన్ ద్వారా ప్రసవాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ దవాఖానల్లో దాదాపు 80 శాతం వరకు సహజ ప్రసవాలే జరుగుతున్నాయి. కానీ, ప్రైవేటులో మాత్రం అదే స్థాయిలో సెక్షన్లు జరగడం విచారకరం. ఇక నుంచి ప్రైవేటు దవాఖానల్లో జరిగే ప్రసవాలపై ఆడిటింగ్ నిర్వహిస్తాం. అనవసరంగా సెక్షన్లు జరిపినట్లు తేలితే విచారణ జరిపి సంబంధిత దవాఖానతో పాటు సెక్షన్లు చేసిన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే దవాఖానతో లైసెన్స్‌తో పాటు సెక్షన్ జరిపిన గైనకాలజీ వైద్యుని రిజిస్ట్రేషన్‌ను సైతం రద్దు చేస్తాం.
– డాక్టర్ వెంకటి, జిల్లా వైద్యాధికారి, హైదరాబాద్ జిల్లా
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- births
- count
- Government
- maternity
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

