మల్కాజిగిరి, జనవరి 22: అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లతో పాటు రేషన్‌కార్డులను ప్రభుత్వం మంజూరు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం బోయిన్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్లు, తెల్ల రేషన్ కార్డుల పంపిణీ పారదర్శకంగా ఉండాలన్నారు.
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు జాబితాలో పొందుపర్చలేదని, నూటికి 5 మంది చొప్పున లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించడాన్ని గట్టిగా ప్రశ్నించాలన్నారు. అధికారులు పారదర్శకంగా పనిచేయకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి, అంజయ్య, కరంచంద్, జగదీశ్‌గౌడ్, పరశురాంరెడ్డి, మురుగేశ్, అమీనుద్దీన్, లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.