సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిని విస్తరించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు జిల్లాలున్న హెచ్ఎండీఏలో మరో నాలుగు జిల్లాలను విలీనం చేస్తూ మొత్తంగా 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో 10472 చదరపు కిలోమీటర్లకు పరిధిని విస్తరించింది. దీంతో హెచ్ ఎండీఏ పరిధి ఓ ఆర్ ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు చేరనున్నది.
తాజా ఉత్తర్వుల్లో విలీన గ్రామాలు, మండలాలు జిల్లాల వారీగా జాబితాను వెల్లడించింది. కొత్తగా హెచ్ఎండీఏ పరిధిలో మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాల పరిధిలోని పలు గ్రామాలు జాబితాలో చేరిపోయాయి. దీంతో అదనంగా 3వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ ఆధీనంలోకి చేరింది.