గోల్నాక, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడకలను అంబర్ పేటలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రూబీ స్టీవెన్ సన్ ఆధ్వర్యంలో అంబర్ పేట ప్రేమ్ నగర్ గ్రీన్ ల్యాండ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కేక్ ను కట్ చేశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పలువురు జర్నలిస్టులను శాలువాలతో ఘనంగా సన్మానించి వారికి మెమొంటోలు అందజేశారు.