కాచిగూడ,ఆగస్టు 8: విద్యపై అవగాహన లేని సీఎం రేవంత్రెడ్డి విద్యాశాఖను తన దగ్గర పెట్టుకోవడం వల్ల విద్యా వ్యవస్థ బ్రష్టుపట్టిస్తున్నాడని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆరోపించారు. ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ సీట్ల తరుమారుపై తక్షణమై ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరుతూ శుక్రవారం కాచిగూడ టూరిస్ట్ చౌరస్తాలో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ తారుమారు ప్రతులను దగ్దం చేశారు. అనంతరం వారు విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్లో అమ్మాయిలకు కేటాయించిన సీట్లను అబ్బాయిల కేటాయించడం ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శమన్నారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సీఎం రేవంత్రెడ్డి గాలిలోకి వదిలేసి, పూర్తిగా వైఫల్యం చెందడాని ఆయన మండిపడ్డారు. గర్ల్స్ కోటాలో జరిగిన అక్రమాలు, దానికి సంబంధించిన సాక్షాలను ధ్వంసం చేసిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా కేటాయించిన సీట్లను వెంటనే రద్దు చేసి, అర్హులైన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేదా, అర్జున్, తేజస్, విప్లవ్, రుద్రాన్స్, దేవాన్స్, కృష్ణతో పాటు ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.