హైదరాబాద్: ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే ఆ విమానం వెనక్కి మళ్లింది. స్పైస్‌జెట్‌కు (Spicejet) చెందిన విమానం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నది. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రం నుంచి బయల్దేరిన 10 నిమిషాలకే విమానంలో సాంకేతిక సమస్యను సిబ్బంది గమనించారు. దీంతో అప్రమత్తమైన పైలట్ ఏటీసీ సమాచారం అందించారు.
అధికారులు విమానాశ్రయంలో దించేందుకు అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలట్.. సేఫ్‌గా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని ఇతర విమానాల్లో తిరుపతికి పంపించేందుకు విమానయాన సంస్థకు చెందిన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.