హైదరాబాద్: ప్రతిక్షణం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆన్లైన్ న్యూస్ మీడియా(వెబ్సైట్, యాప్)కు ప్రభుత్వ ప్రకటనలు(Government announcements) ఇవ్వాలని తెలంగాణ డిజిటల్ మీడియా(Digital media) జర్నలిస్ట్ అసోసియేషన్ (TDMJA) నాయకులు స్వామి ముద్దం, పోతు అశోక్ అన్నారు. ఈ మేరకు తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) ప్రత్యేక కమిషనర్ ఎస్ హరీష్‌కు వినతి పత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్..త్వరలోనే ఆన్లైన్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు స్వామి ముద్దం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా డిజిటల్ మీడియా రంగం కీలక పాత్ర వహిస్తుందన్నారు. ఈ కొత్త మాధ్యమంలో అనేక మంది జర్నలిస్టలు పని చేస్తున్నారని చెప్పారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. హరీష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..