విలీన మున్సిపాలిటీల్లో ఖాళీ స్థలాలపై పన్ను!
ఖాళీ స్థలాలకు పన్నులు విధించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లతో పాటు విలీన మున్సిపాలిటీలైన మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్లలో ఖాళీ ప్లాట్లను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
మేడ్చల్, ఏప్రిల్23 (నమస్తే తెలంగాణ): ఖాళీ స్థలాలకు పన్నులు విధించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లతో పాటు విలీన మున్సిపాలిటీలైన మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్లలో ఖాళీ ప్లాట్లను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఖాళీ ప్లాట్ల గుర్తింపు చివరి దశకు చేరిందని త్వరలోనే నివేదికను సిద్ధం చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
సర్కిళ్ల పరిధితో పాటు శివారు ప్రాంతంలోని మూడు మున్సిపాలిటీలలో వేల సంఖ్యలో ప్లాట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటిపై పన్నులు విధించి సర్కిళ్లు, మున్సిపాలిటీలు ఆదాయం పెంచుకునేలా కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించని క్రమంలో ఖాళీ స్థలాలపై పన్నులు విధిస్తే ఆదాయం సమకూరి అభివృద్ధి పనులతో ఇతరత్రా పనులకు వినియోగించుకోవచ్చన్న అభిప్రాయంతో ఖాళీ స్థలాలకు పన్నులను విధించనున్నారు. ఇప్పటికే ఆస్తి పన్నుల మదింపు కోసం టౌన్ ప్లానింగ్ అధికారులు సర్వే చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు అధికారులు ఖాళీ స్థలాలకు పన్నుల ఖరారును త్వరలోనే చేయనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

