హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్లో(Alpha Hotel) రెండు రోజుల క్రితం ఆహార భద్రత టాస్క్‌ఫోర్స్ అధికారులు(Taskforce official) తనిఖీలు చేపట్టారు. తనిఖీలకు సంబంధించిన విషయాలను గురువారం వెల్లడించారు. హోటల్ యాజమాన్యం ఆహార భద్రత ప్రమాణాలు పాటించట్లేదని అధికారులు తెలిపారు. హోటల్లో పాడిపోయిన మటన్‌తో బిర్యానీ చేసినట్లు గుర్తించారు. అలాగే కస్టమర్లకు ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారం వేడిచేసి ఇవ్వడమే కాకుండా నాసికరం వస్తువులు ఉపయోగిస్తున్నట్లు తనిఖీల్లో బయట పడిందని పేర్కొన్నారు. కిచెన్ కూడా అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా దుర్గంధం వెదజల్లుతుందని గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేసి రూ. లక్ష జరిమానా విధించారు.